Type Here to Get Search Results !

భర్త చనిపోతే మహిళ చేతి వేళ్లను కత్తిరిస్తారు?ఎక్కడ? మీకు తెలుసా? - If the husband dies, the woman's fingers are cut off? Where? do you know

భర్త చనిపోతే మహిళ చేతి వేళ్లను కత్తిరిస్తారు?ఎక్కడ? మీకు తెలుసా?




కొన్ని ఆచారాలు సాంఘిక దురాచారాలుగా ఉంటాయి. మనదేశంలో సతీసహగమనం లాగ ఇండోనేసియాలోనూ ఓ వింత ఆచారం ఉండేది. 


పూర్వ  కాలంలో భర్త చనిపోతే, అదే చితిమీద భార్యని సహగమనం చేయించేవారు. దాన్నే సతీసహగమనం అనేవారు. ఈ సాంఘిక దురాచారం ఇప్పుడు మన దేశంలో లేదు. 


అయితే ఇండోనేసియాలోని డేనిస్‌ గిరిజన జాతుల్లో ఈ కోవకు చెందిన దురాచారం ఒకటి ఉండేది. 


ఈ తెగలో ఒక కుటుంబంలో ఎంత మంది పురుషులు చనిపోతే మహిళకు అన్ని వేళ్లను కత్తిరిస్తారు. కుటుంబంలో పురుషుడు చనిపోయిన తర్వాత మహిళ వేలును ఒక ముఫ్పై నిమిషాల వరకూ గట్టిగా బిగిస్తారు. దీనివల్ల రక్తప్రసరణ ఆగుతుంది. అలా అరగంట ఉంచిన తర్వాత ఆవేలు కింద వరకూ కట్‌ చేస్తారు. 


కొన్ని సంవత్సరాల క్రితం వరకూ అక్కడి ప్రజలు ఈ ఆచారం పాటించే వారు. ప్రభుత్వ చొరవ, ప్రజల సహకారంతో ఆ ఆచారాన్ని రూపుమాపారు.  

Bottom