Type Here to Get Search Results !

చేతబడి అంటే ఏమిటి? ఇది నిజంగా ఉందా ? - What is sorcery? Is it really?

చేతబడి అంటే ఏమిటి? ఇది నిజంగా ఉందా ?



గిట్టని వారిని చంపటానికో, హానిచేయడానికో చేసే/చేయించే విద్యని చేతబడి అంటారు.వివిధ ప్రాంతాలను బట్టి దీనిని విచ్ క్రాఫ్ట్, వూడూ, బ్లాక్ మ్యాజిక్,సిహ్ర్, బాణామతి, చిల్లంగి అని కూడా అంటారు. ఇది ఒట్టి మూఢ నమ్మకం, బూటకం, మాయ. కక్షలు తీర్చుకోటానికి ప్రయోగించే మరో దుర్మార్గం. దీని ప్రభావం వల్లనే నష్టం జరిగిందని భావించి పగలు తీర్చుకొంటున్నారు.

కొందరు ముస్లింలు జీనీల(ఒక రకమైన భూతం) సహాయంతో మాయలు చేయవచ్చని నమ్ముతారు. జీనీలు ఒక మనిషిని ఆవహించవచ్చన్నది సాధారణ ముస్లింల నమ్మకం. వీటిని వదిలించడానికి ఖురాన్ లోని కొన్ని వాక్యాలు పఠిస్తారు. జీనీల సహాయం కోరడం నిషిద్ధం మరియు ఇలా చేయడం సైతాను సహాయం కోరడంతో సమానమని ఇస్లాం చెబుతుంది.

సౌదీ అరేబియా ఇప్పటికీ చేతబడి చేసే వారికి మరణశిక్ష విధిస్తుంది. 2006లో ఫాజా ఫాలిహ్ అనే వ్యక్తికి మరణశిక్ష విధించారు

చేతబడి కారణంగా దానికి చాలా సందర్భాల్లో అమాయకులు బలైపోతున్నారు.అనుమానితుల్ని చితకబాదటం, రాళ్ళతో కొట్టడం, వివస్త్రల్ని చేసి ఊరేగించడం, పళ్ళు రాలగొట్టడం, మల మూత్రాదులు బలవంతంగా తినిపించడం, చిత్ర హింసలకు గురి చేయడం జరుగుతున్నది

మన దేశంలో చేతబడి అనుమానం వల్ల హత్యకి గురవుతున్నవాళ్ళలో ఎక్కువ మంది మహిళలే. ఆ మహిళలలోనూ ఎక్కువ మంది పెళ్ళి కాని స్త్రీలు, భర్త చనిపోయిన స్త్రీలు, భర్త నుంచి విడిపోయిన స్త్రీలు.
Tags

Bottom